మొక్కలతో నేస్తం
- Mar 9, 2024
- 1 min read
చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, వయోవృద్ధులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునే పెద్దలు పార్క్ లో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. అందుకే మన పార్కును ఆకుపచ్చ వనంలా తీర్చిదిద్దాలి. మన ఊరు చుట్టుపక్కల ఒకప్పుడు ఉన్న పచ్చదనం ఇప్పుడు కనిపించడం లేదు. దీనికి పొల్యూషన్ మరియు ఇతర కారణాలు అనేకం ఉన్నాయి. ఈ పార్క్ లో ఇప్పటికి 30 రకాల మంచి వృక్షజాతి మొక్కలు పెంచుతున్నాము, సరియైన నిర్వహణ చేస్తే మనకే కాకుండా మన తర్వాతి తరాల వారికి కూడా ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నాము.

మన స్కూలు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు అనేకమంది విరాళాల రూపంలో ఇచ్కిన మొత్తాన్ని వెచ్చించి బోరు, మోటారు, భూమిలోపల పైపులైను, sprinkler system ఎర్పాటుచేసాము. అలాగే ప్రాధమిక పాఠశాల విధ్యార్ధులను దృష్టిలోఉంచుకొని రక్షణగా మంచి Fencing ఏర్పాటి చేయడం జరిగింది. ఈ కిచేన్ గార్డెన్ లోనే పదిమంది దాతలు ఇచ్చిన సిమెంట్ బెంచీలను అమర్చాము. మనం వేసిన మొక్కల రోజువారీ సంరక్షణకోసం గౌరవవేతనమిచ్చి ఒక కాలేజీనిధ్యార్ధికి అప్పగించడమైనది.

మంచి మొక్కల్ని, నిత్యనిర్వహణ కోసం నగదును విరివిగా ఇవ్వగలరని ఈ గ్రూపు సభ్యులను, గ్రామస్తులను వేడుకుంటున్నాము.
మనం ప్రకృతికి ఈ విధంగా సహాయపడితే ప్రకృతి మనకు తప్పకుండా సహాయపడుతుంది.
ఈ పార్కులో ఒక భాగం లో స్కూల్ పిల్లలు ఆకుకూరలు కూరగాయలు పెంచుతున్నారు. పిల్లలకి వ్యవసాయం మీద ఆసక్తిని పెంచడంతోపాటు, మంచి పోషక విలువలు ఉన్న కూరగాయలను పండించడం వారికి ఎంతో తృప్తిని ఇస్తుంది. రకరకాల పండ్ల మొక్కలు పిల్లలకు జీవవైవిద్యాన్ని తెలియజేయడంతో పాటు, అనేక పక్షులకు ఆహారాన్ని అందిస్తాయి.
మొక్కలు నాటడంలొ, మొక్కల్ని పెంచడంలో మనిషి పొందే ఆనందం పిల్లల్ని పెంచడంలో తప్ప ఇంకెక్కడా ఉండదేమో.
పిల్లలు ఎంతో ఉత్సాహంగా కిచెన్ గార్డెన్ ఆక్టివిటీస్ లో పాల్గొన్టున్నారు. కలుపు తీయడం, మొక్కలకి నీళ్లు పెట్టుకోవడం, పెంచిన ఆకుకూరలు కూరగాయలు పువ్వులను అందరూ షేర్ చేసుకుని మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లు ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నది ఎంతో విలువైనది.
రండి, అందరూ ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కండి. https://srprrzphsoss.com

Comments