Aug 15th 2024 at Pandillapalli (523184)
- Aug 15, 2024
- 1 min read
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ పందిళ్ళపల్లి విద్యార్థులు , ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు . అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది.
ప్రతి సంవత్సరం స్కూలు విద్యార్థులకు ఎంతోమంది దాతలు బహుమతులు ఇస్తూ వస్తున్నారు. అలాగే వారితోపాటు ఈ సంవత్సరం శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి జడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ ఆధ్వర్యంలో అనేకమంది పూర్వ విద్యార్థులు 40 వేల రూపాయలు నగదును వివిధ తరగతులలో మంచి మార్కులు సాధించిన వాళ్లకే కాకుండా చదువు మీద ఆసక్తి ఉండి పేద విద్యార్థులైన వారికి కూడా నగదు రూపంలో ప్రోత్సాహం ఈయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరితోపాటు శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి జడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఊటుకూరు శ్రీమన్నారాయణ గారు, సెక్రటరీ దశరథ్ రొండ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చెరుకూరి రాంబాబు గారు, పృధ్వి రాజు, పోలకం బాలాజీ పాల్గొన్నారు. విధ్యాకమిటి చైర్మన్ చేరుకూరి రాంబాబు గారు సభకు అధ్యక్షత వహించారు

ఇంత మంచి కార్యక్రమానికి అవకాశం కలిగిస్తూ, ఎంతోమంది విద్యార్థులకు మేలు చేసిన
1. కోల మురళీమోహన్ రావు గారికి,
2. రామిశెట్టి రాఘవరావు గారికి,
3. జాగాబత్తుని నాగేశ్వరరావు గారికి,
4. ఊటుకూరి శ్రీనివాసరావు, కిషోర్ కుమార్ గార్లకు,
5. కస్తూరి సత్యనారాయణ గారికి,
6. కోమట్ల వెంకట కుమార్ రెడ్డి గారికి,
7. ఊటుకూరి వెంకట నాగ ప్రసన్న కుమార్ గారికి,
8. రొండా కృష్ణారెడ్డి గారికి,
9. పలగాని చంద్రశేఖర్ రెడ్డి గారికి,
10. కడెం రాముడు గారికి,
11. పల్లపోలు శ్రీనివాసరావు గారికి
మీరు అందించిన ఈ ఆర్థిక ప్రోత్సాహం పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని ఆశిస్తూ,
శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి జడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ తరపున ధన్యవాదములు. 🙏🙏🙏
రొండా దశరథ్,
సెక్రటరీ.


Comments