Sri Ronda Pattabhi Rami Reddy ZPHS Old Students Society
Registration # 162 of 2023


సొసైటి ముఖ్య ఉధ్దేశ్యాలు / Main Objectives
-
To arouse the people to work for the welfare of the community.
-
To plan and action for development and maintenance of parks, Kitchen Gardens, Health Centers, Libraries, and other community centers.
-
To create a sense of cooperation integration and unity among the people
-
To motivate the people to take better participation in the developing community programs.
-
To highlight the causes of various problems affecting the community and hinder the way of progress and development.
-
To get information about the resources and needs
-
To implement programs required for the fulfillment of people’s basic needs.
-
To develop better understanding among the people about the issues and needs.
-
To mobilize the resources to create a suitable ground for the basic needs’ completion and eradication of problems.
-
To foster fellowship and friendship and a sense of belongingness amongst the old students of Sri Ronda Pattabhi Rami Reddy ZPHS .
-
To hold periodic reunions of the old students to maintain links with their Alma-mater.
-
To highlight the rich traditions of the school in the fields of Academics, Cultural activities and sports.
-
To serve as a link between the Past and the Present so as to give a healthy direction to the coming students.
-
To Co-operate with the school administration for the betterment of the Institution.
-
To arrange periodic lectures by old students to the new students, in their respective fields of specialization.
-
To conduct research in education and other disciplines on different subjects relating to education.
-
To promote literacy, cultural and other social activities by awareness programs, adult education classes, lecturers, competitions, exhibitions, workshops, symposiums, cultural programs, press conferences, seminars and incidental acts.
1. సమాజ అవసరాలను తీర్చడానికి ప్రజలను ఉత్తేజ పరచడం
2. సరైన ఆలోచన మరియు ప్రణాళికతో పార్కుల్ని, హెల్త్ సెంటర్స్ ని, గ్రంథాలయాలను, సమాజ అవసరాలు తీర్చే ఇతర సేవలు అందించే కేంద్రాలను నిర్మించడం, వాటిని నిర్వహించడం.
3. గ్రామ ప్రజలందరూ సమైక్యంగా, సమతాభావంతో మెలిగేలా మంచి వాతావరణాన్ని సృష్టించడం
4. గ్రామ అభివృద్ధికి సంబంధించిన కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ లో అందరూ భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించడం
5. సమాజ హితవుకు, గ్రామాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలకు కారణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి గ్రామస్తుల్లో అవగాహన కలిగించటం
6. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటికి తగిన వనరులను గుర్తించడం
7. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను తీర్చడానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహించడం
8. సమస్యలను, అవసరాలను ప్రజలు బాగా అర్థం చేసుకునేలా చిత్తశుద్ధితో పనిచేయడం
9. శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి ZPHS పూర్వ విద్యార్థుల మధ్య స్నేహబంధాన్ని , ఇది తమ సొంతం అనే భావనను పెంపొందించడం
10. నియమిత కాల పరిధిలో ప్రతి పదవ తరగతి బ్యాచ్ చదువు నేర్పిన విద్యాసంస్థలొ తిరిగి కలుసుకునేలా తోడ్పాటునందించడం
11. విద్యా విషయంలో, సాంస్కృతిక రంగాలలోనూ మరియు ఆటపాటల యందు మన విద్యాసంస్థకు ఉన్న గొప్ప సంప్రదాయాలను ప్రముఖంగా పేర్కొంటూ గుర్తింపును కొనసాగించడం
12. పూర్వ విద్యార్థులకు మరియు ప్రస్తుత విద్యార్థులకు ఒక వారధిగా ఉంటూ భవిష్యత్తు తరాల వారికి ఆదర్శమైన లక్ష్యాలను, అవకాశాలను కల్పించడం
13. విద్యాసంస్థల బాగోగులను చూసే అధికారగణం తోను, ఉపాధ్యాయ బృందాలతోను కలసిమెలసి పనిచేస్తూ, వారికి సహాయ సహకారాలు అందించడం
14. వారి వారి రంగాలలో నిష్టాతులైన పూర్వ విద్యార్థులచే మరియు ఇతర ప్రతిభావంతులచే ప్రస్తుత విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పించడం, వర్క్ షాప్స్ నిర్వహించడం
15. అవగాహన తరగతులు, వయోజన విద్యా తరగతులు, ఉపన్యాసాలు, పోటీలు, ప్రదర్శనలు, వర్క్ షాప్స్, చర్చా వేదికలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు మరియు అనుబంధ చర్యల ద్వారా అక్షరాస్యతను, సాంస్కృతిక, సాంఘిక అవగాహనను పెంపొందించడం
16. అవసరమైన స్కూలు విద్యార్థులకు అంది వచ్చేలా అన్ని అవకాశాలు కలిగించడం, స్కాలర్షిప్స్ ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యా రంగంలోనే కాక ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలు నిర్వహించి ప్రతిభను వెలికితీయడం
17. నిస్సహాయులైన, పేద విద్యార్థులకు, బలహీన వర్గాల ఉన్నతికి, విభిన్న సామర్థ్యం కలిగిన విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం
18. పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించడం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గ్రామంలో ప్రజలకు అందుబాటులో కి తీసుకురావడం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విద్యను ప్రోత్సహించడం
19. ఈ సొసైటీ ఉద్దేశాలకు దగ్గరగా పనిచేస్తున్న ఇతర సొసైటీలతో కలసి పనిచేయడం