General Discussion
2024- 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాలలో 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన సజ్జా దివ్యశ్రీ
రామచంద్రాపురం పేద మత్స్యకార కుటుంబానికి చెందిన కోడూరు స్వేచ్చామణి జిల్లా పరిషత్ హైస్కూల్ పందిళ్ళపల్లి లో చదివి పదవ తరగతి ఫలితాలలో 589 మార్కులు సాధించి, మన పాఠశాలకే కాకుండా, వాళ్ళ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకు వచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ వారి గ్రామానికి వెళ్లి అభినందనలు తెలియజేస్తూ స్వీట్స్ పంచడం జరిగింది
బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరియు దేవల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతిలో మెరిట్ సాధించిన ఎనిమిది మంది స్టూడెంట్స్ కు శాలువా, పూల బొకే, మెమొంటో మరియు నగదు ప్రోత్సాహం తో సన్మానించడం జరిగింది.
1. సజ్జా దివ్యశ్రీ 596 , 2. పృధివి ధనుష్ 589 , 3. కుందుం శ్యామ సాయి శ్రీ 589 , 4. గుత్తి మోహిత్ విజయ్ కుమార్ 587 , 5. బండ్ల షణ్ముఖ ప్రియ 585 , 6. పేరక వెంకట నాగ గీతిక 585 , 7. పేరిచెట్ల కనిష్క్ 578, 8. గుంటూరు యామిని యోజిత 576
550 కి పైగా మార్కులు సాధించిన 20 మంది స్టూడెంట్స్ కి, వారి ఇళ్లకు వెళ్లి స్వీట్స్ ప్యాకెట్స్ ఇస్తున్న పందిళ్ళపల్లి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్