top of page

రొండా రామకృష్ణా రెడ్డి & వేణుగోపాల రెడ్డి చారిటబుల్ ట్తస్టు పిల్లల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని

  • Oct 11, 2023
  • 2 min read

రొండా రామకృష్ణా రెడ్డి & వేణుగోపాల రెడ్డి చారిటబుల్ ట్తస్టు పిల్లల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని పెంపొందిచడానికి, పుస్తకం కొని చదువుకొలేని పెదవిధ్యార్దుల ప్రయోజనం కోసం పందిళ్ళపల్లి గ్రామంలో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఈ చారిటబుల్ ట్రస్ట్ గత రెండుదశాబ్ధాల కాలంగా వేటపాలెం మండలం పందిళ్లపల్లి కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పందిళ్లపల్లి లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ తో పాటు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు విద్య మరియు ఆటల రంగాలలో పలు పోటీలు పెట్టి ఉపకార వేతనం, బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తోంది. పేద విద్యార్థుల చదువు మరియు ఇతర రంగాల లో కృషి చేయటం కోసం వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తోంది చారిత్రకంగా పందిళ్లపల్లి గ్రామము చాలా ప్రాచీన మైనది. అయితే ఇక్కడ నివసించే అధిక సంఖ్యాకులైన ప్రజలు విద్య మరియు సామాజిక అంశాలలో వెనుకబడి ఉండడానికి కారణం ఇక్కడ ఒక గ్రంథాలయం లేకపోవడం కూడా కావచ్చు. చాలా కాలంగా ట్రస్ట్ గ్రంథాలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఈ విషయమై కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రం వల్ల పాత హై స్కూల్ లో గ్రంథాలయ నిర్వహణకు ఒక గదిని కలెక్టర్ గారు ఇవ్వడం జరిగిందని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ గ్రంథాలయానికి దాతల నుండి పుస్తకాలు ఇతర మౌలిక సదుపాయాలకై ట్రస్ట్ మిమ్మల్ని కోరుతోంది. స్కూలు పిల్లలు మరియు ఊరి ప్రజల కోసం ఉపయోగపడే పుస్తకాలు మీరే కొని ఇస్తే సంతోషిస్తాం. మీరు ఇచ్చిన పుస్తకాలపై దాతల పేరు తప్పనిసరిగా వేస్తాం అని తెలియజేస్తున్నాము. మీ దగ్గర ఉన్న పాత పుస్తకాలు కూడా గ్రంథాలయానికి మీరు ఇవ్వచ్చు. మీరు ఏదైనా న్యూస్ పెపర్ కు గాని మాగజైనుకు గాని చందాకట్టగలిగితే నాకు తెలియచేయండి. గమనిక- మీరు ఇచ్చే పుస్తకాలు పురాణాలు, కావ్యాలు, కథల పుస్తకాలు, నవలలు, సైన్స్, సామాజిక అంశాలపై చైతన్యం కలిగించే పుస్తకాలు, పిల్లలపుస్తకాలు అయి వుండాలి. మీరు ఇచ్చే పుస్తకాలు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో ఉండాలి. క్రింద ఉన్న ఏ చిరునామాకైనా మీ పుస్తకాలు పంపించగలరు. మీరు పంపించడానికి ఏదైనా ఇబ్బందిఉంటే , వాట్సప్ లో మెసేజి పెట్టండి లేక మొబైల్కి (9849546535) కాల్ చేయండి. మా వాలేంటరు వచ్చి పిక్ చెసుకుంటారు. Hyderabad Address Ronda Dasaradha Rami Reddy, Sri Rama Krishna Nilayam 1-5-935/1, Father Balaiah nagar, Old Alwal, Scenderabad-500010 Pandillapalli Address Ronda Dasaradha Rami Reddy, S/o Ramakrishna Reddy Sri Rama Krishna Nilayam 6-115, Pandillapalli, Vetapalem Mandal, Prakasam District, Andhra Pradesh-523184



ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page